Hyderabad, జూలై 31 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు నెల వరకు బుధాదిత్య రాజయోగం ఉంటుంది. కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక చోటు చేసుకోవడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు.

ఆ తర్వాత బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించాడు. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఆగస్టు 17 వరకు బుధాదిత్య రాజయోగం ఉంటుంది. ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక అప్పటి వరకు బుధాదిత్య రాజయోగం ఉంటుంది.

ఇది కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. మరి బుధాదిత్య రాజయోగంతో ఏ ర...