భారతదేశం, ఆగస్టు 4 -- ఖగోళంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాదికి సంబంధించి రెండోది, చివరిదైన సూర్యగ్రహణం ఆగస్టు 12న కనువిందు చేయనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి దేశంలో ఎలాంటి మతపరమైన నియమాలు, సూతక కాలం వర్తించవు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ గ్రహణ ప్రభావం సమస్త రాశులపై ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని ఒక శక్తివంతమైన ఖగోళ పరిణామంగా భావిస్తారు. ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో, ఆ ప్రభావం దానికి పదిహేను రోజుల ముందు నుంచి, ఆ తర్వాత పదిహేను రోజుల వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కర్కాటక రాశిలో సంభవించనుంది.

ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం కర్కాటక రాశిలోనే వస్తుండటంతో, ఆ రాశికి చెందిన చంద్రుని ప్రభావం కారణంగా ఈ రాశ...