భారతదేశం, ఆగస్టు 1 -- ఆగస్టు నెల వచ్చేసింది. ఆగస్టు నెలలో కొన్ని పండుగలు, ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఏ రోజు ఏ పూజ చేయాలి? ఆగస్టులో రానున్న ముఖ్య పర్వదినాల గురించి పూర్తి జాబితా ఇక్కడ ఉంది. చూసేయండి.

ఆగస్టు నెల ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా చాలా విశేషమైనదని చెప్పొచ్చు. ఆషాఢం పూర్తయి శ్రావణ మాసం కూడా ఆగస్టు నెలలో వస్తుంది. ఆగస్టు నెలలో శివారాధన, విష్ణు పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మహాలక్ష్మి ఉపాసన, వేదోపాకర్మలు వంటి అనేక విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆగస్టు నెలలోనే కామిక ఏకాదశి, చుక్కల అమావాస్య, నాగ చతుర్థి, గరుడ పంచమి, నాగ పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణిమ వంటి పర్వదినాలు ఈ మాసం ప్రత్యేకతను ఇంకా పెంచనున్నాయి.

సంకట చతుర్థిని ప్రతి నెలా కృష్ణపక్ష చవితి నాడు జరుపుకుంటాము. ఈ రోజున వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. వ...