Hyderabad, జూలై 30 -- ఈ ఏడాది ఆగస్టు 17న ఉదయం 1:41కి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే పెద్ద విషయం ఏంటంటే, కేతువు కూడా అదే రాశిలో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో సూర్య-కేతువుల సంయోగం ఏర్పడుతుంది. సూర్య-కేతువుల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలను తీసుకువస్తుంది.

గ్రహాలకు రాజు అయిన సూర్యుడి సంచారం చాలా విశేషమైనది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు శుభ స్థానంలో ఉంటే పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. డబ్బు కూడా బాగా వస్తుంది. సూర్య-కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి ఆగస్టులో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి, గౌరవం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు.

వృషభ రాశి వారికి ఈ రెం...