భారతదేశం, జూలై 22 -- గ్రహాల రారాజు అయిన సూర్య భగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే రాబోయే ఆగస్టు నెలలో సూర్యుడు ఏకంగా నాలుగు సార్లు తన గమనాన్ని మార్చుకోబోతున్నారు.

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సాధారణంగా నెల రోజులకు ఒకసారి రాశి మారుస్తుండగా, నక్షత్ర మార్పు మాత్రం ప్రతి 13 నుంచి 15 రోజులకు జరుగుతుంది. ఆగస్టు 3న అశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించే సూర్యుడు, ఆగస్టు 17న మఘ నక్షత్రంలోకి, అలాగే ఆగస్టు 31న పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి గోచరంచనున్నారు.

ఇక అత్యంత ముఖ్యమైన పరిణామంగా, సరిగ్గా ఏడాది తర్వాత సూర్య భగవానుడు తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి ఆగస్టు 17న అడుగుపెట్టనున్నారు. ఇలా ఆగస్టు నెలలో సూర్యుడి ఈ వరుస మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ, కొన్ని ప్రత్యేక రాశుల వారికి మాత్రం ఇది గోల్డెన్ పీరియడ...