భారతదేశం, మార్చి 25 -- ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ప్రచారంతో జనాలు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వల కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా పెట్రోల్, డీజిల్ దొరకదని ప్రచారం జరుగుతుండటంతో పెట్రోల్ బంకుల వద్దకు భారీగా తరలివెళ్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులు చేపల వేటకు వెళ్లడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ.. డీజిల్ కొరత కారణంగా పడవలు నిలిచిపోవడంతో గత 10 రోజులుగా చేపల వేట కార్యకలాపాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ పరిస్థితికి ప్రపంచ పరిణామాలు పాక్షికంగా కారణమని, దీంతో మత్స్యకారులకు పని లేకుం...