భారతదేశం, నవంబర్ 12 -- విశాఖపట్నంలో 31వ సీఐఐ సమ్మిట్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వివిధ సంస్థల ఛైర్మన్‌లు, 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

ఏపీలో అనుసరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కార్ల యూనిట్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కూడా కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించామన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉందన్నారు. ఇదీ అనుమతులను వేగంగా మంజూరు చేయడంలో ఏపీ ట్రాక్ రికార్డ్ అని చెప్పుకొచ్చారు.

'బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మి...