భారతదేశం, జూలై 28 -- ఆంధ్రప్రదేశ్​లో లులు మాల్స్​ ఏర్పాటుపై బిగ్​ అప్డేట్​! విశాఖపట్నంలో లులు మాల్​​ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జరీ చేసింది. మరోవైపు విజయవాడలో భూములను కేటాయించేందుకు వేగంగా కసరత్తులు జరుగుతున్నాయి.

విశాఖపట్నంలో 13.5 లక్షల చదరపు అడుగుల్లో లులు మెగా షాపింగ్​ మాల్​ ఏర్పాటుకానుంది. ఇందుకోసం బీచ్​ రహదారి దగ్గర ఉన్న హార్బర్​ పార్కులో లులు ఇంటర్నేషనల్​ షాపింగ్​ మాల్స్​ లిమిటెడ్​కి 13.73 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇది 9ఏళ్ల లీజుకు అందివ్వడం జరిగింది. ఫలితంగా లులు సంస్థ ఇక్కడ లులు కనెక్ట్​, లులు ఫ్యాషన్​, లులు ఫ్యామిలీ ఎంటర్​టైన్మెంట్​ సెంటర్​ వంటివి వాటిని నిర్మించనుంది.

కాగా, ఈ భూమి ధరను ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్​ పర్యాటక భూముల కేటాయింపు విధానం ద...