భారతదేశం, ఏప్రిల్ 2 -- ఒడిశాలో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. పూరీ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాగే పూరీ ఆలయం చుట్టూ ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే పూరీ దగ్గర ఉన్న సముద్రంలో ఆంజనేయ స్వామిని గొలుసులతో కట్టేసిన విషయం మీకు తెలుసా? హనుమంతుడిని ఎందుకు అలా గొలుసులతో కట్టేశారు? దీని వెనుక ఉన్న కథ, బేడీ హనుమాన్ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పూరీ జగన్నాథ్ ఆలయానికి సమీపంలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిలో చాలా ప్రత్యేకమైన ఆలయం బేడీ హనుమాన్ ఆలయం. ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం బంగారు బేడీలతో బంధించబడి ఉంటుంది. సముద్ర అలలు జగన్నాథ ఆలయంలోకి వెళ్లకుండా జగన్నాథుడే స్వయంగా హనుమంతుడిని బంగారు గొలుసులతో కట్టేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధ...