Hyderabad, సెప్టెంబర్ 16 -- జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎక్కువ కాలం పాటు మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉంటాయి. అయితే, అష్ట దరిద్రాలు అన్నమాట మీరు వినే ఉంటారు. హిందూ సంప్రదాయంలో వ్యక్తి జీవితంలో దుఃఖం కలిగించేవి, దరిద్రాలను తీసుకు వచ్చేవి ఎనిమిది రకాల కష్టాలు. అష్ట దరిద్రాలంటే ఏంటి? వీటి నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఏంటి వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఆర్థిక, జ్ఞాన, ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక, కర్మ, సంతాన, సంతోష రంగాలలో ప్రభావితం చేస్తాయి. ఈ అష్ట దరిద్రాల వలన జీవన నాణ్యతను దిగజారిపోతుంది. నిత్యం అసంతృప్తి ఉంటుంది. అశాంతి కలుగుతుంది. అయితే ఇవి ఎందుకు వస్తాయంటే జాతకంలో గ్రహ స్థితులు, జీవనశైలి, పరిస్థితులు, కర్మ ఫలితాలు వలన వస్తాయి. వీటి వలన జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది...