Hyderabad, ఆగస్టు 25 -- ప్రతిష్టాత్మమైన గామా (Gulf Academy Movie Awards) అవార్డ్స్‌కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా గామా వేడుకలు జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ గామా అవార్డ్స్ వేడుకలను 2025 ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్‌గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్ట్ 24) హైదరాబాద్‌లో గామా అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ సీనియర్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి గోపాల్, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.

జ్యూరీ ...