భారతదేశం, జనవరి 26 -- లోకేష్ కనగరాజ్, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఖైదీ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. అయితే దీనిని పక్కన పెట్టేసినట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా దీనిపై లోకేష్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో మూవీ తర్వాత తాను చేయబోయేది ఖైదీ 2నే అని స్పష్టం చేశాడు.

'ఖైదీ 2' సినిమాను పక్కన పెట్టేసినట్లే అని వస్తున్న పుకార్లను లోకేష్ కనగరాజ్ పూర్తిగా ఖండించాడు. తన నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తోనే ఉంటుందని, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఖైదీ' సీక్వెల్ పనులు మొదలవుతాయని అతడు చెప్పాడు. కేవలం రెమ్యునరేషన్ కోసమే తాను 'ఖైదీ 2'ను ఆపేశానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కూడా లోకేష్ వివరణ ఇచ్చాడు. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న తన సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుత...