భారతదేశం, ఆగస్టు 19 -- దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికను జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో విస్తారంగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావం మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ఉండవచ్చని పేర్కొంది.

పశ్చిమ భారతదేశంలో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఆగస్ట్​ 19-20 తేదీల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధమైన పరిస్థితులు మంగళవారం తీరప్రాంత, ఉత్తర కర్ణాటకలో కూడా ఆశించవచ్చు. రాబోయే రోజుల్లో కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఆగస్ట్​ 19 ను...