భారతదేశం, జూలై 3 -- సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడంతో పాటు, మక నక్షత్రంలో కేతువుతో కలిసి 'ద్వంద్వ ప్రభావం' చూపబోతున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయో, ఏయే రాశుల వారికి అదృష్టం వరిస్తుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు భోగభాగ్యాలు, ప్రేమ, సౌందర్యం మరియు సృజనాత్మకతకు కారకుడు. అటు కేతువు ఆధ్యాత్మికత, కర్మఫలాలు మరియు అంతర్మథనానికి చిహ్నం. ఇప్పుడు సింహ రాశిలో కేతువు ఉండగా, శుక్రుడు అక్కడికే చేరుకోవడం వల్ల రెండు గ్రహాల కలయిక ఏర్పడుతోంది. అంతేకాకుండా, శుక్రుడు కేతువుకు చెందిన 'మక' నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఒకేసారి రెండు విధాలుగా శుక్రుడిపై కేతువు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మనసులో కోరికలు పెరగడంతో పాటు, కొన్ని విషయాల నుంచి దూరమయ్యే ధోరణి కూడా కనిపిస్తుంది.

శుక్రుడు మర...