Hyderabad, అక్టోబర్ 11 -- తెలుగులో నిన్న (అక్టోబర్ 10) థియేటర్లలో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అరి. అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరెక్కిన ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ జయశంకర్ ఇదివరకు పేపర్ బాయ్ వంటి సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించారు. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు జయశంకర్.

పేపర్ బాయ్ సినిమా తర్వాత దాదాపుగా ఏడేళ్లకు డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కించిన సినిమానే అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్‌‌తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. అరి అంటే శత్రువు అనే అర్థం వస్తుంది. మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కొవాలో చెప్పే ప్రయత్నంగా వచ్చింది అరి.

థియేటర్లలో విడుదలైన అరి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూన్న అరి మూవీ ...