Hyderabad, అక్టోబర్ 3 -- అమ్మవారిని తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి నవరాత్రులను అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది వారి ఇంటికి అమ్మవారికి కట్టిన చీరలను తెచ్చుకుంటూ ఉంటారు. చాలా చోట్ల అమ్మవారికి కట్టిన చీరలను వేలం పాటలో కూడా వేస్తారు. అలాంటి చీరలు కూడా చాలా మంది వేలం పాటలో కొనుగోలు చేసి ఉంటారు. అయితే అమ్మవారికి కట్టిన చీరలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది మొక్కుల కింద అమ్మవారికి లేదా స్వామివారికి చీరలను ఇస్తూ ఉంటారు. అయితే, ఆ విగ్రహాలకు కట్టి ఇచ్చిన చీరలు ఏం చేయాలి? ఆ చీరలను ఇంటికి తెచ్చుకోవచ్చా? వాటిని వాడుకోవచ్చా?

ఇలా అమ్మవారికి కట్టిన చీరలు లేదా అమ్మవారి ఎదుట పెట్టిన చీరలను శేష వస్త్రములు అని అంటారు. ఎలా అయితే అమ్మవారికి సమర్పించిన పూలను తలలో పెట్టుకుంటామో, కుంకుమ...