భారతదేశం, డిసెంబర్ 19 -- అమెరికాలో ఎంతో కాలంగా కొనసాగుతున్న 'డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డ్ లాటరీ' ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్​సీఐఎస్​)కు ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక 'బ్రౌన్ యూనివర్సిటీ'లో జరిగిన ఘోర కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని 48 ఏళ్ల క్లాడియో నెవెస్ వాలెంటెగా గుర్తించారు. పోర్చుగల్ జాతీయుడైన ఇతడు, ఎంఐటీ ప్రొఫెసర్ నునో లౌరీరో హత్యతో కూడా సంబంధం కలిగి ఉన్నాడని దర్యాప్తులో ...