భారతదేశం, ఆగస్టు 23 -- అమెరికాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నయాగరా ఫాల్స్ సందర్శించి తిరిగి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు, న్యూయార్క్ హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 54 మంది ప్రయాణికులలో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాల పర్యాటకులు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

బఫెలో నగరానికి 40 కిలోమీటర్ల (25 మైళ్లు) తూర్పున ఉన్న పెంబ్రోక్ సమీపంలోని హైవేపై న్యూయార్క్​ బస్సు ప్రమాదం జరిగింది. నయాగరా ఫాల్స్ సందర్శన తర్వాత పర్యాటకులు న్యూయార్క్ సిటీకి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ దృష్టి మరలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

"డ్రైవర్ అశ్రద్ధ వల్ల బస్సుపై నియంత్రణ కోల్పోయి, ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాము," అని న్యూయార్క్ రాష్ట్ర పోలీసు కమాండర్ మేజర్ ఆండ్రే రే చెప్పారు...