భారతదేశం, అక్టోబర్ 6 -- అమెరికా పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన మోటెల్ మేనేజర్ దారుణ హత్యకు గురయ్యారు. రాబిన్సన్ టౌన్‌షిప్‌లోని ఒక మోటెల్‌ పార్కింగ్ స్థలంలో జరుగుతున్న గొడవ గురించి తెలుసుకుని బయటకు వెళ్లిన 50 ఏళ్ల రాకేష్ ఎహాగబన్​ని దుండగుడు కాల్చి చంపాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రాకేష్ తలకు అతి దగ్గరగా కాల్పులు జరపడంతో.. ఆయన అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 37 ఏళ్ల స్టాన్​లీ యూజీన్ వెస్ట్​గా గుర్తించారు. అతనిపై క్రిమినల్ హత్య, హత్యాయత్నం, నిర్లక్ష్యంగా మరొక వ్యక్తికి ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ తనతో పాటు ఉంటున్న ఒక మహిళ, చిన్నారితో కలిసి దాదాపు రెండు వారాలుగా ఆ మోటెల్‌లో బస చేస్తున్నాడు.

కాగా పార్కింగ్ స్థలంలో ఆ మహిళతో గొడవపడిన తర్వాత, వెస్ట్ ఆమెపై కాల్పులు జరిపా...