Hyderabad, జూలై 4 -- రాబిన్‌హుడ్ సినిమా తర్వాత నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా నటించారు. ఇవాళ (జూలై 4) తమ్ముడు రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది.

-నేను గతంలో ఎస్వీసీ సంస్థలో "జాను" అనే మూవీలో నటించాను. తమ్ముడు కోసం పిలవగానే వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్‌లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు గారు ఈ మూవీ గురించి చెబుతూ అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర క్యారెక్టర్‌కు నేను సెలెక్ట్ అయ్యాను.

-తమ్ముడు మూవీ టైటిల్ ఈ కథకు యాప్ట్. పవన్ కల్యా...