Hyderabad, జూలై 6 -- స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తానా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాలో తానా 2025 వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. తానా వేదికపై మాట్లాడిన సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తానా స్టేజీపై సమంత మాట్లాడుతూ.. "తానా వేదికపై నిలబడే అవకాశం రావడం నా జీవితంలో ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నా. ఈ స్టేజీపై నిలబడటానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది తానా గురించి, ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉన్నాను. కానీ, ఇక్కడికి వచ్చి మీరు చూపిన ప్రేమకు థ్యాంక్స్ చెప్పడం ఇవాళే సాధ్యమైంది"అని అన్నారు.

"నా తొలి సినిమా ఏ మాయ చేశావేతో నన్ను మీ మనిషిలా భావించారు. మీ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించారు. అప్పటి నుంచి మీరు నాకు నిరంతరంగా ప్రేమ, సపోర్ట్ ఇస్తున్నారు. దానికి ...