భారతదేశం, జూలై 6 -- జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న నియో కార్పొరేషన్ అనే కంపెనీ ఉద్యోగులను శిక్షించడానికి అత్యంత దారుణమైన మార్గాన్ని ఎంచుకుంది. సేల్స్ టార్గెట్లను చేరుకోలేని ఉద్యోగులతో బలవంతంగా నగ్న చిత్రాలు తీయించి షేర్​ చేయడమే కాదు, కంపెనీ బాస్ వారిని శారీరకంగా కూడా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

నియో కార్పొరేషన్ అనే సంస్థ విద్యుత్, ఇంధన ఆదా పరికరాల అమ్మకాలు, వాటిని ఇన్‌స్టాల్ చేసే రంగంలో పనిచేస్తుంది. ప్రస్తుతం జపాన్ వ్యాప్తంగా దీనికి తొమ్మిది శాఖలు ఉన్నాయి.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ షాకింగ్ ఘటన ఈ ఏడాది మార్చ్​లో ఐదుగురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యం ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో అధికారంలో ఉన్న వారిచే మాటల దుర్భాష, వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. దాఖలు చేసిన పిటిషన్‌లో ఒక వ్యక్తి మాట్...