భారతదేశం, ఆగస్టు 26 -- మధ్యప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! వరకట్నం కోసం ఓ భర్త తన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలు పెట్టాడు. ఆ మహిళ చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది!

మధ్యప్రదేశ్‌ ఖర్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఖుష్బూ పిప్లియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆమెకు వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ఆమె భర్త వరకట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఆమె అంటే ఇష్టం లేదని చెబుతూ తరుచుగా ఆమెపై దాడి చేసేవాడు.

సోమవారం తెల్లవారుజామున, ఖుష్బూ తనను తాను విడిపించుకుని, ఒక ఇంటి పనిమనిషి వద్ద మొబైల్ ఫోన్ తీసుకుని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం అవర్‌కచ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలికి వేడి చే...