Hyderabad, ఆగస్టు 5 -- జబర్దస్త్.. తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే ఓ కామెడీ షో. ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ఎప్పుడో 12 ఏళ్ల కిందట ప్రారంభమై ఇప్పటికే విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడీ 12 ఏళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో అప్పటి యాంకర్లు రష్మి, అనసూయ.. జడ్జీలు నాగబాబు, అప్పటి కమెడియన్లందరూ వచ్చారు.

జబర్దస్త్ పేరుతో ఈటీవీలో ఇప్పటికీ ప్రతీ వారం వచ్చే కామెడీ షోకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇందులోని కామెడీ స్కిట్లు నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ షో మొదలై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే శుక్ర, శనివారాల్లో (ఆగస్ట్ 8, 9) స్పెషల్ షోని ఈటీవీ ప్లాన్ చేసింది.

దీనికి సంబంధించిన ప్రోమో మంగళవారం (ఆగస్ట్ 5) రిలీజ్ చేశారు. ఇందులో జబర్దస్త్ మొదలైనప్పుడు టీమ్ లీడర్లుగా ఉన్న అదిరే అభ...