భారతదేశం, అక్టోబర్ 11 -- గతేడాది 'క' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత దిల్ రూబా అంటూ లవ్ స్టోరీ చేశాడు. ఇప్పుడు 'కె ర్యాంప్'తో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు వచ్చేస్తున్నాడు. ఇవాళ (అక్టోబర్ 12) రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేసేలా ఉంది.

కిరణ్ అబ్బవరం అప్ కమింగ్ యూత్ రొమాంటిక్ కామెడీ మూవీ 'కె ర్యాంప్' ట్రైలర్ శనివారం రిలీజైంది. ఇది యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు కలగలిసిని పూర్తి కమర్షియల్ సినిమాగా అనిపిస్తోంది. ''కాళ్లు ఊపకూడదు దరిద్రం'' అని బామ్మ అంటే.. ''నేను ఊపట్లేదు బామ్మ నా గర్ల్ ఫ్రెండ్ ను తలుచుకుంటే వాటికవే ఊగుతున్నాయి''అని హీరో అనడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదంట కదా అంటే తాగి పడిపోవాల్సి వచ్చింద...