భారతదేశం, ఆగస్టు 15 -- రజనీకాంత్ మాస్ ఊచకోత ఇది. కలెక్షన్ల మోత ఇది. కూలీ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో దుమ్ము రేపిన ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లలో చెలరేగిపోయింది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన కూలీ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

రజనీకాంత్ లీడ్ రోల్ ప్లే చేసిన కూలీ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టింది. కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ అఫీషియల్ గా కలెక్షన్ల వివరాలు ప్రకటించింది. కూలీ సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ.151 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

''సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డు మేకర్, రికార్డు బ్రేకర్. రూ.151 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో కూలీ సినిమా తొలి రోజు అత్...