భారతదేశం, డిసెంబర్ 20 -- రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ సినిమా ఫ్యాన్ బయోపిక్ గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా రాబట్టలేకపోయింది.

రీసెంట్ టైమ్స్ లో తెలుగులో మంచి హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఆంధ్రా కింగ్ తాలూకా ఒకటి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ప్రతి ఫ్యాన్ కూడా ఇది తన బయోపిక్ అనుకునేలా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇవ...