భారతదేశం, జూలై 27 -- ఓటీటీలోకి మరో తెలుగు మూవీ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో రిలీజై డిజాస్టర్ గా మిగిలిన నితిన్ 'తమ్ముడు' (Thammudu) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇవాళ (జులై 27) తమ్ముడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాప్ సినిమా నితిన్ ఆశలను నిలబెట్టలేకపోయింది.

హీరో నితిన్ లేటెస్ట్ డిజాస్టర్ 'తమ్ముడు' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ఆ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్టు షేర్ చేసింది.

''తన లక్ష్యాన్ని, అక్కని తిరిగి తేవడా...