Hyderabad, ఆగస్టు 15 -- అనుపమ పరమేశ్వరన్.. తెలుగుతోపాటు సౌత్ భాషలన్నింటిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. తన మొదటి మలయాళ మూవీ 'ప్రేమమ్'తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఆమెకు తమిళం, తెలుగు పరిశ్రమలలో అవకాశాలు కల్పించింది. ముఖ్యంగా తెలుగులో తక్కువ సమయంలోనే ఈ యువ మలయాళ నటికి మంచి పేరు వచ్చింది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఆమె నటనా వైవిధ్యాన్ని చూపించిన కొన్ని ప్రముఖ సినిమాలు ఏవి? అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

2015లో వచ్చిన మలయాళ మూవీ ప్రేమమ్ లో నటుడు నివిన్ పౌలీ.. జార్జ్ అనే ప్రధాన పాత్రలో నటించాడు. ఇది అతని జీవితంలోని వివిధ దశలలోని ప్రేమ కథలను చూపిస్తుంది. అనుపమ ఆ సినిమాలో మేరీ అనే అందమైన అమ్మాయి పాత్ర పోషించింది. సాయి పల్లవి కూడా ఈ సినిమాతోనే మలయాళ చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ ప్రేమమ్ మూవీ సన...