భారతదేశం, మే 15 -- సాధారణంగా మనకి మొత్తం తెలుగు నెలలు 12 వస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం 13 వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ఈ ఏడాది 13 తెలుగు నెలలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు కూడా ఉండవు. అసలు అధిక జ్యేష్ఠ మాసంలో ఎందుకు శుభకార్యాలు జరుపుకోకూడదు, పెళ్లిళ్లు చేసుకోకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కొన్ని శుభకార్యాలను ఈ నెలలో చేయకూడదు. 36 రోజుల పాటు పెళ్లిళ్లు కూడా చేయకూడదు. మే 13 నుంచి ముహుర్తాలు లేవు. పైగా మే 17 నుంచి జూన్ 18 వరకు అధిక మాసం. మే 17 నుంచి జూన్ 18 వరకు శుభకార్యాలు చేయకూడదు. అయితే మళ్లీ జూన్ 19 నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. ఇక ఎందుకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్లు చేయకూడదనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈ ఏడాది...