భారతదేశం, నవంబర్ 14 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రెండు, మూడు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

త్వరలోనే నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు రాబోతోంది. ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శుక్రుడు తులా రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరస్తున్నాయి.

రాహువు, శుక్రుడు ధనం, అదృష్టం, విజయాలు వంటి వాటిని తీసుకురాబోతున్నారు. శుక్రుడు నవంబర్ 25న తులా రాశిలో ఉంటాడు. ఆ సమయంలో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి. అదృ...