Hyderabad, జూలై 30 -- ప్రతి నెలా గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. అదే విధంగా, ఆగస్టు నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాలు మార్పు చెందుతున్నాయి. ఆగస్టు నెలలో విలాసాలు, అదృష్టం, సంతోషానికి కారకుడైన శుక్రుడు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు.

శుక్రుడు ఆగస్టు 1న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రక్షాబంధన్ నాడు బుధుడు తన స్థానాన్ని మారుస్తాడు. ఆగస్టు 9న బుధుడు ఉదయిస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 30న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు కూడా ఆగస్టు 17న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 21న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ గ్రహాలు మార్పు చెందడంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. చంద్రుడు కూడా కాలానికి అనుగుణంగా రాశులను మారుస్తాడు. దీంతో, ఆగస్టు నెలలో కెరీర్, ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్, ప్రేమ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ...