భారతదేశం, అక్టోబర్ 29 -- జోత్యిష్య శాస్త్రంలో దేవగురువుగా భావించే బృహస్పతి రాశి మార్పు మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 31న గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి అడుగుపెట్టనున్నారు. 2027 జనవరి 25 వరకు గురుడు ఇదే రాశిలో సంచరించనున్నారు. ఈ అరుదైన గోచార ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మేష, కర్కాటక, ధనుస్సు రాశుల వారికి ఇది స్వర్ణయుగమని చెప్పవచ్చు.

జ్యోతిష్య గణనల ప్రకారం అక్టోబర్ 31వ తేదీన గురు గ్రహం తన సంచారాన్ని మారుస్తోంది. సుమారు మూడు నెలల పాటు అంటే జనవరి వరకు గురుడు సింహ రాశిలోనే ఉంటారు. ఈ కాలంలో కొందరికి ఆర్థిక కష్టాలు తొలగిపోగా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని ప్రగతి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది.

మేష రాశి వారికి గురుడి గోచారం అనేక సానుకూల ఫల...