భారతదేశం, డిసెంబర్ 25 -- 'దండోరా' ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించినందుకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ట్రోలింగ్ బారిన పడింది. నెటిజన్లు తనను 'ఆంటీ' అని పిలుస్తూ వయసు గురించి అవహేళన చేయడంపై అనసూయ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు తాను వాడిన అసభ్య పదజాలానికి శివాజీ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. కానీ కొత్తగా ఈ రచ్చలోకి కరాటే కల్యాణి వచ్చి చేరింది.

హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి శివాజీ చేసిన కామెంట్స్ ఇష్యూ ఇంకా చల్లారలేదు. దీనిపై గళం విప్పిన అనసూయను సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడంతో ఆమె ఘాటుగా స్పందించింది.

విషయం మీద మాట్లాడలేక, తన వయసు గురించి మాట్లాడుతున్నారని అనసూయ మండిపడింది. ఆమె ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చింది.

"ఈ రోజు చివరిగా ఒక్క విషయం చెప్తా. అసలు సమస్య గురించి మాట్లాడలేక.. ఆడ, మగ తేడా...