భారతదేశం, డిసెంబర్ 23 -- నటుడు శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓసారి దీనిపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించిన అనసూయ.. తాజాగా పరోక్షంగా అతని పేరు ఎత్తకుండానే మళ్లీ కౌంటర్ వేసింది. అలా అనడం మగతనం కాదంటూ ఆమె చాలా గట్టిగానే స్పందించింది.

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ కాసేపటి కిందట ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇలా రాసుకొచ్చింది.

"ఈ మధ్య ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దానిపై పబ్లిక్‌గా వస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఇది గుర్తుచేయాలి అనిపిస్తోంది. కొందరు ఇతరులను కంట్రోల్ చేయడాన్ని 'బాధ్యత' అని, జడ్జ్ చేయడాన్ని 'రక్షణ' అని ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా తన పర్సనల్ ఛాయిస్....