భారతదేశం, జూన్ 20 -- పోకో ఎఫ్​7 స్మార్ట్‌ఫోన్ జూన్ 24న భారతదేశంలో రూ. 35,000 లోపు ధరతో విడుదల కానుంది. ఈ ప్రైజ్​ సెగ్మెంట్​లో ఇది వివో టీ4, ఐక్యూ నియో 10 వంటి అనేక ఇతర మిడ్-రేంజ్ ఫోన్‌లతో పోటీపడుతుంది. అయితే, ఐక్యూ నియో 10, పోకో ఎఫ్​7 రెండూ స్నాప్‌డ్రాగన్ 8ఎస్​ జెన్ 4 ప్రాసెసర్‌ని కలిగి ఉన్నాయి. దీంతో ఏ మోడల్ ఎక్కువ విలువను అందిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి, స్పష్టమైన అవగాహన కోసం, పోకో ఎఫ్​7, ఐక్యూ నియో 10 ఫీచర్స్​ వంటి వాటిని పోల్చి చూద్దాము..

పోకో ఎఫ్​7 స్మార్ట్​ఫోన్​ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో పిల్-షేప్​ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఆర్జీబీ లైటింగ్ ఉంది. ఇది దాని పనితీరు, గేమింగ్ సామర్థ్యాలను సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పైభాగం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్, నథింగ్ మోడల్‌లు అందిం...