భారతదేశం, జూలై 4 -- ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్‌లు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. నథింగ్ ఫోన్ 3- వన్‌ప్లస్ 13 వంటి మోడల్స్​ ఈ ట్రెండ్‌కి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు ఫోన్‌ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇవి వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్​ మధ్య ఉన్న ప్రధాన తేడాలు, ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి.

నథింగ్ ఫోన్ 3 తన ప్రత్యేకమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రాన్స్​పరెంట్​ బ్యాక్ ప్యానెల్ దీనికి బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్, ఐపీ68 రేటింగ్‌తో, ఇది డిజైన్- మన్నికను కలుపుతుంది. అయితే, 9ఎంఎం థిక్​నెస్​ కారణంగా ఇది జేబులో కొంత ప్లేస్​ని ఆక్రమించవచ్చు. వన్‌ప్లస్ 13 మాత్రం సాదాసీదా డిజైన్‌ను ఎంచుకుంది...