భారతదేశం, నవంబర్ 16 -- ఆంధ్ర కింగ్ తాలూకా.. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఇది. ఈ సినిమాపై రామ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చారు. ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి రామ్ పోతినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దీనికి మహేష్ బాబు.పి డైరెక్టర్. ఈ సినిమాను మొదట నవంబర్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చారు. ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

''ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇవ్వబోతున్న మహేష్ కు ధన్యవాదాలు. థ్యాంక్స్ గివ...