భారతదేశం, ఆగస్టు 10 -- థ్రిల్లర్ మూవీస్ కు ఓటీటీలో ఉండే క్రేజ్ వేరు. అది హారర్ అయినా, సస్పెన్స్ అయినా, క్రైమ్ అయినా.. థ్రిల్లర్ అంటే చాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఊగిపోతుంది. ఇక ఇందులోనూ మలయాళ థ్రిల్లర్లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. 'కమ్మట్టం' (Kammattam) సిరీస్ డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.

మర్డర్ మిస్టరీ ఆధారంగా అల్లుకున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'కమ్మట్టం' వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ కు వేళైంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ప్రసారమవుతుంది. ఆగస్టు 29న ఆరు ఎపిసోడ్ల ఈ ఇన్వెస్టిగేటివ్ జీ5లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా అందుబాటులో ఉంటుంది.

కమ్మట్టం వెబ్ సిరీస్ మర్డర్ మిస్టరీతో కూడిన క్రైమ్...