భారతదేశం, ఫిబ్రవరి 7 -- శివమణి డ్రమ్స్ తో, రిషబ్ శర్మ వీణతో మ్యాజిక్ చేశారు. వీళ్లు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే స్టేడియం మొత్తం ఊగిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో ఆడుతోంది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

ఐసీసీ ఛైర్మన్ జై షా, టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. రోహిత్ శర్మ ట్రోఫీ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే డ్రమ్స్ మోతతో స్టేడియం మార్మోగింది. అనంతరం అమెరికా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.

టీ20 ప్రపంచకప్ 2026లో తమ ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే స్టార్ పేసర్ బుమ్రా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.

టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో నం...