భారతదేశం, జూలై 26 -- క్యాచీ ట్యూన్స్.. కాళ్లు కదిలించే మూవ్స్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే లిరిక్స్.. అదిరిపోయే స్టెప్పులు.. ఇలా మిరాయ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది. ఇవాళ (జులై 26) రిలీజైన 'వైబ్ ఉంది' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీతో మిరాయ్ (Mirai)పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.

మిరాయ్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ పాట 'వైబ్ ఉంది' ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇప్పుడు తెగ పాపులర్ గా మారిన జెన్ జెడ్ భాష లిరిక్స్ తో ఈ సాంగ్ మరింత ట్రెండీగా మారింది. 'ఓ పోరి దిల్ దారు వయ్యారివే' అంటూ స్టార్ట్ అవుతుంది ఈ పాట. 'వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే.. ఈ గ్లోబ్ ను ఆపే వైబ్ ఉందిలే' అంటూ సాంగ్ సాగుతుంది.

వైబ్ ఉంది సాంగ్ లో అన్నీ చక్కగా కుదిరాయి అని చెప్పాలి. ఇంగ్లీష్ పదాలను వాడుతూ క్రిష్ణ...