Hyderabad, ఆగస్టు 25 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ మారుతి. దర్శకుడు మారుతి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ నటించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

ఆగస్ట్ 29న థియేటర్లలో త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బార్బరిక్ గురించి, ఉదయభాను పాత్ర, తదితర సినీ విశేషాలను పంచుకున్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స.

బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు. నార్త్‌లో బార్బరికుడుకు ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్యరాజ్ గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. మేకప్‌ విషయంలో ఆయనను చాలా...