భారతదేశం, జూలై 26 -- సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 'అతడు' చిత్రం క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో శనివారం (జులై 26) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అతడు సీక్వెల్ పైనా మాట్లాడారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ రెడీ అంటే సీక్వెల్ ప్లాన్ చేస్తామని మురళీ మోహన్ అన్నారు. ''మహేష్ బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే 'అతడు' సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ఈ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక సినిమా గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్‌కు ఇంత ...