Hyderabad, జూన్ 21 -- సెవెన్ హిల్స్ బ్యానర్‌పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా రూపొందిన సినిమా సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా చేశాడు. పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్స్‌గా నటించారు.

జులై 4వ తేదీన సోలో బాయ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సోలో బాయ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా, సింగర్‌గా, నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్‌లో ఆర్పీ పట్నాయక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల...