భారతదేశం, సెప్టెంబర్ 20 -- పుష్ప సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. దీనికి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది AA22 x A6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. అయితే ఈ మూవీలో నుంచి అల్లు అర్జున్ పిక్ ఒకటి లీక్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి ఐకాన్ స్టార్ ఫొటో లీక్ అయేందనే టాక్ వినిపిస్తోంది. పూర్తి క్లారిటీగా లేని అల్లు అర్జున్ ఒక అస్పష్టమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దూరం నుండి తీసిన ఈ ఫోటోలో ఆయన సూపర్ హీరో దుస్తులలో మాన్ బన్ తో ఉన్నాడు. ఆయన బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో నిలబడి ఉన్నాడు. ఈ ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్...