Hyderabd, సెప్టెంబర్ 29 -- ఈరోజు మూలా నక్షత్రం అందుకే ఈ రోజు కనకదుర్గా దేవి సరస్వతీ దేవీ మాత రూపంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రులలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది.

మూలా నక్షత్రం అనగా జగన్మాత జన్మనక్షత్రం. అందుకే ఈరోజు ఎంతో ప్రాశస్త్యం కలిగిన రోజుగా భావిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో అర్ధరాత్రి నుండే కిటకిటలాడుతోంది. సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే.. విద్యాబుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన...