భారతదేశం, ఏప్రిల్ 18 -- హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 19న ఈ పర్వదినం వస్తోంది. 'అక్షయ' అంటేనే క్షయం లేనిది లేదా తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పనికైనా, దానధర్మాలకైనా రెట్టింపు ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. కేవలం బంగారం కొనడమే కాదు, ఈ రోజున చేసే దైవారాధన మీ జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి, కుబేరుడిని సరైన పూలతో పూజిస్తే, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు.

సృష్టి స్థితి లయకారుడైన విష్ణుమూర్తిని అక్షయ తృతీయ నాడు పసుపు రంగు పూలతో పూజించడం అత్యంత శ్రేయస్కరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు శాంతి, సుస్థిరత మరియు సానుకూలతకు చిహ్నం. ఈ పర్వదినాన బంతి పూలు లేదా పసుపు చామంతులతో నారాయణుడిన...