భారతదేశం, ఏప్రిల్ 10 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ యోగం అనేది చాలా శుభప్రదమైన యోగం. అరుదుగా ఏర్పడుతుంది. ఇది సూర్య, చంద్రుల వలన ఏర్పడే శక్తివంతమైన యోగం. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఈ ప్రత్యేకమైన యోగం ఏప్రిల్ 19న ఏర్పడనుంది. ఆరోజు అక్షయ తృతీయ కూడా.

అక్షయ తృతీయ నాడు సూర్యుడు మేష రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. ఇలా ఈ రెండు గ్రహాలు సంచారం చేయడంతో అక్షయ యోగం ఏర్పడుతుంది. ఇది డబ్బు, సంతోషం, సంపద వంటి వాటిని తీసుకొస్తుంది. ఈ అక్షయ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు రానుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరులో మీరు ఒకరేమో చూసుకోండి.

మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా మంచ...