భారతదేశం, సెప్టెంబర్ 28 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. జ్ఞానం, సంపద, అదృష్టం, సంతానం మరియు వివాహానికికారకుడైన గురు భగవానుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో గురువు తన నక్షత్ర పాదంలో కీలక మార్పులు చేయబోతున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 7:03 గంటలకు బృహస్పతి అశ్లేష నక్షత్ర నాలుగో పాదంలోకి అడుగుపెట్టనున్నారు.

ఈ అరుదైన నక్షత్ర మార్పు అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 31 మధ్యాహ్నం మాఘ నక్షత్ర మొదటి పాదానికి గురుడు ప్రయాణం మారుస్తారు. ఆశ్లేష నక్షత్ర నాలుగో పాదం మీన నవాంశకు చెంది ఉండటం, పైగా దీనికి గురుడే అధిపతి కావడం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. పండిత నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం, ఈ ప్రత్యేక గ్రహ స్థితి కొన్ని రాశుల వారికి కె...