భారతదేశం, అక్టోబర్ 12 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గతి మార్పునకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా అనేక గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈ అక్టోబర్ నెలలో శని, సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, కుజుడు వంటి కీలక గ్రహాల స్థితిగతులలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఈ గ్రహాల గతుల ప్రభావం ద్వాదశ రాశుల మీద భిన్నంగా పడుతుంది. అయితే, ఈసారి అక్టోబర్‌లో రాబోయే మార్పులు ఏడు రాశుల వారికి మాత్రం అత్యంత అనుకూలంగా మారనున్నాయని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర, మీన రాశుల వారికి ధన లాభంతో పాటు వృత్తి, వ్యాపార రంగాల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది.

వృషభ రాశి వారికి అక్టోబర్ మిగిలిన రోజులు ఆర్థిక పరంగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి. సం...